WATCH: బీజేపీ ఎమ్మెల్యేపై బురద చల్లిన మహిళలు… ఎందుకంటే?
లక్నో: బీజేపీ ఎమ్మెల్యేపై స్థానిక మహిళలు బురద చల్లారు. బకెట్లతో బురద నీళ్లను తలపై గుమ్మరించారు. బురద నీళ్లతో తల స్నానం చేయించారు. ఉత్తర ప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పిపర్‌డ్యూరా ప్రాంతానికి చెందిన మహిళలు వాన దేవుడి ప్రసన్నం కోసం పురాతన ఆచారాన్ని పాటిస్తుంటారు. ఇందులో భాగంగా స్థానిక పాలకులకు బురద నీళ్లతో తల స్నానం చేయించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ ప్రాంత మహిళలు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే జైమంగల్ కనోజియా, కార్పొరేషన్ చైర్మన్ కృష్ణ గోపాల్ జైస్వాల్‌ల తలపై బురద నీళ్లు గుమ్మరించి మట్టి స్నానం చేయించారు. ఈ సందర్భంగా మహిళలు తమ సంప్రదాయ పాటలు పాడారు.
కాగా, పిల్లలు, పెద్దలు బురద నీటితో తల స్నానం చేయడం వల్ల వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడని ఈ ప్రాంత మహిళల నమ్మకమని బీజేపీ ఎమ్మెల్యే జైమంగల్ కనోజియా, కార్పొరేషన్ చైర్మన్ కృష్ణ గోపాల్ జైస్వాల్ తెలిపారు. పురాతన సంప్రదాయమైన ఈ బురద స్నానంలో తాము పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Women in Pipardeura area of Maharajganj in Uttar Pradesh throw mud at MLA believing this will bring a good spell of rainfall for the season pic.twitter.com/BMFLHDgYxb
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 13, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

