ఇండియా.. స్ట్రీట్ ఫుడ్‌కు పెట్టింది పేరు. ఏ రాష్ట్రం వెళ్లినా రోడ్‌సైడ్ బండ్లపై మనకిష్టమైన ఆహారం, పానీయాలు దొరుకుతాయి. అయితే, కొందరు వాటిని అమ్మడంలో ఓ ప్రత్యేకత చూపుతుంటారు. అలాంటి వీడియోలు ఈ మధ్య సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా, పంజాబ్‌లో నిమ్మసోడా అమ్ముకునే ఓ వ్యక్తి చేష్టలకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. అతడి వీడియో చూసి, జోకులేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.
పంజాబ్‌లోని కిరాట్పూర్ సాహిబ్‌లో గోలీసోడా అమ్ముకునే వ్యక్తి వెరైటీగా నిమ్మసోడా తయారుచేస్తున్నాడు. నిమ్మకాయలను పిండేదగ్గరనుంచి గోలీసోడా కొట్టి కలిపేవరకూ పాటపాడుతూ ఆకట్టుకుంటున్నాడు. దీన్ని వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టగా, వైరల్‌గా మారింది. కచ్చాబాదాం కొడుకు అంటూ ఒకరు కామెంట్ చేయగా, అరిచి..అరిచి అలసిపోయాడు.. అతడికి ముందు నిమ్మసోడా తాగించండని మరొకరు ఫన్నీగా కామెంట్ చేశారు. కాగా, తనను చూసి ఎవరు నవ్వుకున్నా తాను పట్టించుకోనని, అందరికంటే విభిన్నంగా బిజినెస్ చేయడమే తన పనని ఆ నిమ్మసోడా అమ్ముకునే వ్యక్తి వినమ్రంగా చెప్పాడు.