ముంబై : దేశ ఆర్ధిక రాజధాని ముంబై నయాగావ్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ అమోల్ యశ్వంత్ కాంబ్లే (38) రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారాడు. ఇన్స్టాగ్రాం వీడియోలో ఆయన డ్యాన్స్ మూవ్మెంట్స్ నెటిజన్లను కట్టిపడేశాయి. అప్పురాజా మూవీ నుంచి ఆయా హై రాజా పాటకు కాంబ్లే డ్యాన్స్ వేసిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోకు ఆయన ‘పోలీస్ కో చిదానే కి సజా హై యే” అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోలో కాంబ్లే మరో కంటెంట్ క్రియేటర్ మహీం ప్రాంతానికి చెందిన చిన్మయ్ ఖెడేకర్తో కలిసి చిందేశాడు. కాంబ్లేకు బాల్యం నుంచి డ్యాన్స్ పట్ల ఆసక్తి అధికం కాగా తన అన్నయ్యతో కలిసి డ్యాన్స్ వేసేవాడు.
పోలీస్‌గా శాంతి భద్రతలను పర్యవేక్షిస్తూ పౌరులను కాపాడటం తన బాధ్యతని, వీక్లీ ఆఫ్ రోజు మాత్రం తన పిల్లలు, చెల్లెలు పిల్లలతో కలిసి డ్యాన్స్ చేస్తుంటానని కాంబ్లే చెప్పుకొచ్చాడు. ఇక వైరల్ వీడియో థీమ్‌ను ఆయన వివరిస్తూ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ అటుగా బైక్‌పై వెళుతున్న వ్యక్తిని మాస్క్ సరిగ్గా ధరించాలని అడుగుతాడని, ఆపై వారిద్దరూ తమ డ్యాన్స్ మూవ్‌మెంట్స్‌తో ఆకట్టుకుంటారని వివరించాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలతో స్పందించారు. ఓ యూజర్ ఎక్సలెంట్ ఫెర్మామెన్స్ భాయిజీ అని ప్రశంసించగా మరో యూరజ్ సూపర్ అంటూ పోలీస్ మూవ్‌మెంట్స్‌ను కొనియాడాడు.