న్యూఢిల్లీ: ఒక కోతి అందరినీ ఆశ్చర్యపరిచింది. అచ్చం మనిషిలాగా రెండు కాళ్లపై కొంత దూరం నడిచింది. అనంతరం ఒక సరస్సు రైలింగ్పైన కాళ్లతోనే జంప్ చేసి మరింత సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది. నేచర్లైఫ్ ఓకే అనే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో కలిపించే ఒక కోతి తొలుత మనిషిలాగా రోడ్డు పక్కగా రెండు కాళ్లతో వేగంగా నడుస్తుంది. అమ్మాయిలాగా కాస్త వయ్యారంగాను నడకసాగిస్తుంది. అనంతరం లేక్ చుట్టూ ఉన్న రైలింగ్పైకి దూకుతుంది. రైలింగ్ సిమెంట్ దిమ్మలపై ఒక దాని నుంచి మరోదానిపై రెండు కాళ్లతో పిల్లల మాదిరిగా జంప్ చేస్తుంది. ఆ సమయంలో అక్కడున్న వారు ఇది చూసి చాలా ఆశ్చర్యపోయారు.
కాగా, ఈ నెల 3న పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు సుమారు 50 వేల మంది ఈ వీడియోను చూశారు. పలువురు నెటిజన్లు ఇమోజీలతో ఫన్నీగా కామెంట్లు కూడా చేశారు.