ఎవరండి చెప్పింది జంతువులకు తెలివి ఉండదని. ఈ వీడియో చూస్తే.. జంతువులకు మనుషులకంటే ఎక్కువ తెలివి ఉంటుందని ఒప్పుకుంటారు. సాధారణంగా మనుషులతో కలిసి.. మనుషుల్లో ఉండే జంతువులు అంటే కుక్క, పిల్లి, కోతి. కుక్కను, పిల్లిని ఇంట్లో పెంచుకుంటారు కానీ.. కోతులను ఎవ్వరూ పెంచుకోరు. అయినా కూడా అవి ఊళ్లలో పడి తిరుగుతుంటాయి.
ఊళ్లోలోని జనాలపై తిరగబడుతుంటాయి. ఏది దొరికితే దాన్ని ఎత్తుకెళ్తుంటాయి. అవి చేసే చేష్టలు మామూలుగా ఉండవు.
తాజాగా ఓ కోతి చేసిన చేష్టలు చూస్తే.. వామ్మో దీనికి ఇంత తెలివి ఎక్కడిది అని ముక్కున వేలేసుకుంటారు. ఓ వ్యక్తి కళ్లద్దాలను దొంగలించిన కోతి.. ఎంత బతిమిలాడినా వాటిని తిరిగి ఇవ్వలేదు. దీంతో ఆ వ్యక్తి బిస్కెట్ ప్యాకెట్ కొని దానికి ఇవ్వబోయాడు. అయితే.. అది బిస్కెట్ ప్యాకెట్‌ను తీసుకోబోతుంది కానీ.. కళ్లద్దాలను ఇవ్వడం లేదు. దీంతో అది ఇస్తేనే.. ఇది ఇస్తా అన్నట్టుగా ఆ వ్యక్తి వ్యవహరించడంతో.. బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని.. కళ్లద్దాలను కిందికి విసిరేసింది ఆ కోతి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు అయితే ఆ కోతి తెలివి చూసి నోరెళ్లబెడుతున్నారు. వామ్మో.. దీనికి ఇంత తెలివా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.
Smart 🐒🐒🐒
— Rupin Sharma (@rupin1992) October 28, 2021
Ek haath do,
Ek haath lo 😂😂😂😂🤣 pic.twitter.com/JHNnYUkDEw
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సెకండ్ క్లాస్ పిల్లాడిని బిల్డింగ్ మీద తలకిందులుగా వేలాడదీసిన హెడ్మాస్టర్.. వైరల్ ఫోటో
Penis Plant : ఈ పువ్వు పూయడమే చాలా అరుదు.. దీని దగ్గరికి వెళ్తే కంపు వాసన
Model Photoshoot : తండ్రి శవం పక్కన మోడల్ ఫోటోషూట్.. నువ్వు మనిషివేనా అంటున్న నెటిజన్లు
పెండ్లికి ముందే శృంగారం.. మైనర్ బాలికకు గర్భం.. యూట్యూబ్ వీడియో చూస్తూ సీక్రెట్‌గా డెలివరీ..!
Squid Game : స్క్విడ్ గేమ్ వీఐపీ యాక్టర్ గెయోఫ్రే గుర్తున్నాడా? ఆయనకు ఇండియాతో కనెక్షన్ ఉందట