న్యూఢిల్లీ : ఆన్లైన్లో మనం ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి ఇంటికి చేరుతున్న ఘటనలు తరచూ చూస్తుంటాం. తాజాగా ఢిల్లీ వ్యక్తి ఆనియన్ రింగ్స్ ఆర్డర్ చేయగా తీరా డెలివరీ చేసిన పదార్ధం చూసి అతడు షాకయ్యాడు. రెస్టారెంట్ నుంచి ఆనియన్ రింగ్స్‌కు ఆర్డర్ ఇవ్వగా పచ్చి ఉల్లిగడ్డను రింగ్స్‌గా కట్ చేసి పంపడతంతో కంగుతిన్నాడు. ఉబైదు అనే వ్యక్తి ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వగా తనకు ఎదురైన అనుభవాన్ని ఇన్స్టాగ్రాం రీల్లో పోస్ట్ చేశాడు.
ఈ పోస్ట్‌కు యూజర్లు లాఫింగ్ ఎమోజీలతో స్పందించారు. తాను ఆనియన్ రింగ్స్‌కు ఆర్డర్ ఇస్తే ఇది వచ్చిందంటూ ఉబైదు పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆపై ఉబైదు కెమెరాను చూస్తూ నవ్వుతుండగా చిన్న కంటైనర్‌లో పచ్చి ఉల్లిగడ్డను రింగ్స్‌లా కట్ చేసిన పీస్‌లపై కెమెరాను పాన్ చేయడం ఈ వీడియోలో కనిపిస్తోంది.
ఏ రెస్టారెంట్ ఈ నిర్వాకం చేసిందో ఉబైదు స్పష్టంగా వెల్లడించలేదు. ఈ వీడియో ఆన్లైన్లో షేర్ అయినప్పటి నుంచి ఇప్పటివరకూ 20,000 వ్యూస్‌ను రాబట్టింది. రెస్టారెంట్ వారు టెక్నికల్‌గా ఎలాంటి తప్పు చేయలేదు ఆనియన్ నుంచి కట్ చేసిన రింగ్స్ కనిపిస్తున్నాయని ఓ యూజర్ రాసుకురాగా, మరికొందరు యూజర్లు రెస్టారెంట్ తీరును తప్పుపట్టారు.