సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది.. ఎలా వైరల్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. కొందరైతే ఓవర్ నైట్ స్టార్స్ అవుతారు. ఇటీవల బుల్లెట్టు బండి పాటకు డ్యాన్స్ చేసిన పెళ్లి కూతురే దానికి ఉదాహరణ. తను ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయింది. పలు డ్యాన్స్ షోలలో ఆఫర్లు కూడా వస్తున్నాయి తనకు. అందుకే.. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏం జరిగేది ఊహించలేం.
మీకు గుర్తుందా? 2019లో ఓ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ నడుస్తుంటే.. పాకిస్థాన్‌కు చెందిన క్రికెట్ ఫ్యాన్.. నడుము మీద చేతులు వేసుకొని డిఫరెంట్ స్టయిల్లో నిలబడ్డాడు. అప్పట్లో ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. స్టేడియంలో ఉన్న కెమెరాలు కూడా ఒక్కసారిగా.. అతడివైపే తిరిగాయి.
తాజాగా అటువంటిదో మరో ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. రాఖీ పండుగ నాడు.. యువసేన సభ్యురాలు ఒకరు.. ముంబైలోని ఓ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడ ఉన్న పోలీసులకు రాఖీ కట్టింది. ఒక పోలీస్‌ను సెల్ పక్కన కూర్చోబెట్టి.. రాఖీ కడుతుండగా.. సెల్లో ఉన్న ఓ వ్యక్తి అలాగే.. నడుము మీద చేతులు వేసుకొని విచిత్రంగా వాళ్లవైపు చూస్తుంటాడు. తెల్లారి పేపర్లలో కూడా అదే ఫోటోను ప్రింట్ చేశారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో ఎవరో అప్లోడ్ చేస్తే.. దాన్ని చూసిన నెటిజన్లు.. ఓవైపు రక్షా బంధన్.. మరోవైపు బంధీ.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఆ ఫోటోతో ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. హల్ చల్ చేస్తూ ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది.
Today's newspaper has this pic of a yuva sena member tying rakhi to a policeman which is well.., hmm… but what really elevates it to meme level is the guy in the lockup looking on. pic.twitter.com/WVLx0fXMQD
— Vikram Hegde (@vikramhegde) August 23, 2021
https://t.co/mk64rcniYB pic.twitter.com/LLB8kGancS
— ATIDIVYA ANAND (@atidivya_anand) August 23, 2021
Same energy pic.twitter.com/J1cPf2RzzQ
— Shravann (@shravannnnnn) August 23, 2021