వీడెవడండి బాబు.. నడి రోడ్డులో కారు టాప్‌పై కూర్చుని మందు తాగతూ..
ఎవరైనా ఇంట్లోనో, బార్లోనో, రెస్టారెంట్లోనో మద్యం సేవించడం చూస్తుంటాం. కొందరైతే ఎవరికీ కనిపించకుండా రోడ్డు పక్కన, చెట్ల పొదల్లో మందు కొడుతుంటారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించినట్టున్నాడు. ఏకంగా రద్దీ రహదారిపై ట్రాఫిక్ మధ్యలో కారు పైకప్పుపై కూర్చుని మద్యం సేవిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ ఘటన హర్యాణా రాష్ట్రం గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video | ఎవరైనా ఇంట్లోనో, బార్లోనో, రెస్టారెంట్లోనో మద్యం సేవించడం చూస్తుంటాం. కొందరైతే ఎవరికీ కనిపించకుండా రోడ్డు పక్కన, చెట్ల పొదల్లో మందు కొడుతుంటారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించినట్టున్నాడు. ఏకంగా రద్దీ రహదారిపై ట్రాఫిక్ మధ్యలో కారు పైకప్పుపై కూర్చుని మద్యం సేవిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ ఘటన హర్యాణా రాష్ట్రం గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తి కారు పైన కూర్చుని ప్రశాంతంగా మద్యం సేవిస్తూ ఉంటాడు. కారులో ముందు సీట్లో కూర్చున్న మరో వ్యక్తికి సైతం పైన్నుంచి మందు సప్లై చేస్తుంటాడు. రద్దీ ప్రదేశంలోని ట్రాఫిక్ జామ్‌లో కనిపించి ఈ దృశ్యాలను అక్కడే ఉన్న జనం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్తా వైరల్ అవుతోంది.
ఈ వీడియోను రవి హందా అనే నెటిజన్ జనవరి 7వ తేదీన ట్విట్టర్లో పోస్టు చేశాడు. ‘గురుగ్రామ్‌లో మాత్రమే ఇలా జరుగుతుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. 15 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటి వరకు 30వేల మందికిపైగా వీక్షించారు.
This can only happen in Gurgaon. 😂 pic.twitter.com/SMLBDB0bjl
— Ravi Handa (@ravihanda) January 7, 2023
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

