ఆర్మీలో చేరడమే లక్ష్యంగా అర్ధరాత్రి పది కిలోమీటర్లు పరుగెడుతున్న బాలుడు ప్రదీప్ మెహ్రా వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. అతడిపై చాలామంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎనలేని ప్రేమను చూపుతున్నారు. కాగా, ప్రదీప్ మెహ్రాకు రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ సతీశ్ దువా మంచి ఆఫర్ ఇచ్చారు. ప్రదీప్‌కు ఆర్మీలో ఉద్యోగం వచ్చేలా తాను దగ్గరుండి శిక్షణ ఇప్పిస్తానని ట్వీట్ చేశారు.
సోమవారం ఉదయం నుంచి ప్రదీప్ మెహ్రా రన్నింగ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతున్నది. చాలామంది ఈ వీడియో చూసి స్ఫూర్తిపొందారు. దీంతో సోషల్‌మీడియాలో ఈ వీడియో తుఫాన్మాదిరిగా దూసుకుపోయింది. నిన్నటివరకూ ఈ ఉత్తరాఖండ్ కుర్రాడు ఎవరికీ తెలియదు. ఒక్క వీడియోతో ఓవర్‌నైట్ ఇంటర్నెట్ సెన్సేషన్ అయిపోయాడు.
ప్రదీప్ మెహ్రా వీడియో రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ సతీశ్ దువా దృష్టిని ఆకర్షించింది. ప్రదీప్‌లో ఉన్న కసిని చూసి అతడికి సహాయం చేసేందుకు ముందుకొచ్చాడు. ‘బాలుడిలోని జోష్ ప్రశంసనీయం..ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్షలో అతడు ఉత్తీర్ణత పొందేలా నేను సహాయపడుతా. అతడికి శిక్షణ ఇచ్చే విషయంపై ఈస్టర్న్ కుమాన్ రెజిమెంట్ కల్నల్, ఈస్టర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ రాణాతో మాట్లాడాను. అతడి రెజిమెంట్‌లో ప్రదీప్‌కు శిక్షణ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు’ అని సతీశ్ దువా ట్వీట్ చేశారు.
The future of our country is in great hands. Blessing to this kid 🙏
— BADSHAH (@Its_Badshah) March 20, 2022