సాధారణంగా ఎక్కువగా క్యూ ఎక్కడ ఉంటుంది.. అంటే టక్కున చెప్పేది వైన్ షాపుల ముందు అని. లేదంటే సినిమా థియేటర్లో కూడా టికెట్ కౌంటర్ దగ్గర భారీ క్యూను చూడొచ్చు. కానీ.. ఒక షాపు ముందు అంత భారీ క్యూ ఎందుకు అంటారా? పదండి.. ఆ షాపు స్పెషాలిటీ ఏంటి? అసలు.. ఆ షాపు ముందు జనాలు ఎందుకు క్యూ కట్టాలో తెలుసుకుందాం.
ఇంతకీ అది ఏ షాపో తెలుసా? ఒక బుక్ స్టోర్. అస్సలు నమ్మరు కదా. ఈ డిజిటల్ యుగంలో ఇంకా పుస్తకాలు చదివే వాళ్లు ఉన్నారా? పొద్దున లేస్తే ఫోన్ పట్టుకొని తిరిగే వాళ్లు.. పుస్తకాలు చదువుతారా? అని వెటకారంగా మాట్లాడకండి. ఎందుకంటే.. ఆ క్యూ నిజంగానే బుక్ స్టోర్ ముందు ఉన్నదే. అందుకే కదా.. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేది.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. కోల్కతాలోని ఓ బుక్ స్టోర్లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అన్ని పుస్తకాల మీద 50 శాతం డిస్కౌంట్ను అందించారట. అందుకే.. పుస్తకాభిమానులు.. ఆ షాపు ముందు క్యూ కట్టారు. ఆ ఫోటోను ఓ ట్విట్టర్ యూజర్ తన అకౌంట్లో షేర్ చేశాడు. దీంతో ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు అయితే.. ఆ ఫోటోను చూసి అక్కడి ప్రజలను తెగ మెచ్చుకుంటున్నారు. అన్ని నగరాల్లో వైన్ షాపుల ముందు క్యూ కడితే.. కోల్కతాలో మాత్రం జనాలు.. బుక్ షాపుల ముందు క్యూ కడుతున్నారు.. అంటూ చమత్కరించారు.
Photo of the queue in front of a publisher's store in Kolkata.
— Diptakirti Chaudhuri (@diptakirti) August 11, 2021
Every city lines up for booze. Only Kolkata lines up for books. pic.twitter.com/aSqJgMASCa
Details of the offer: Dey's Publishing offered a 50% discount on their in-store catalogue from 11th-15th August, calling it "Independence Day Book Bazaar".https://t.co/V7zOUyJ3c0
— Diptakirti Chaudhuri (@diptakirti) August 11, 2021