హైదరాబాద్: ఫ్యాషన్ రిటెయిల్ బ్రాండ్స్ అమ్మకాల్లో దిగ్గజం అయిన లైఫ్ స్టైల్ సంస్థ భారీ సేల్ ఆఫర్ ప్రకటించింది. మీ అల్మారాలకు సరికొత్త హంగులు దిద్దే అవకాశం కల్పించింది. లైఫ్ స్టైల్లో లభ్యమయ్యే అన్ని రకాల ఫ్యాషన్ ఉత్పత్తులపై 50 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేసింది. టాప్ బ్రాండ్స్‌కు చెందిన లేటెస్ట్ ట్రెండ్స్‌పై కూడా ఈ 50 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ లభించనుంది.
ప్రముఖ బ్రాండ్స్‌కు చెందిన వస్త్రాలు, ఫుట్‌వేర్, హ్యాండ్ బ్యాగ్స్, బ్యూటీ ప్రోడక్ట్స్పైన లైఫ్ స్టైల్ ఈ ఆఫర్‌ను అనౌన్స్ చేసింది. అదేవిధంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లు చేసేవారికి అదనంగా మరో ఆఫర్ ప్రకటించింది. ఏ లైఫ్ స్టైల్ స్టోర్‌లోనైనా ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో రూ.7500 అంతకుమించిన కొనుగోళ్లు చేస్తే.. రూ.1000 గరిష్ట పరిమితికి లోబడి 10 శాతం అదనపు డిస్కౌంట్ లభించనుంది.