కోరుట్ల రూరల్ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పల్లెలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అధ్వాన స్థితికి చేరుకున్నాయని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ఐలాపూర్ లాపూర్ గ్రామంలో
పల్లెల విద్యాభివృద్ధి, పడకేసిన పారిశుధ్యానికి నిరసనగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ వైఫల్యాలను, పల్లెల పట్ల చూపుతున్న నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఎండగట్టారు.
దేశంలో దాదాపు 6.5 లక్షల గ్రామాలు ఉంటే, ఉత్తమ గ్రామాల విభాగంలో కేంద్రం ప్రకటించిన 40 అవార్డుల్లో ఏకంగా 13 అవార్డులు (33 శాతం) సాధించి తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. నాడు కేసీఆర్ నాయకత్వంలో ‘పల్లె ప్రగతి’ ద్వారా ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసి పరిశుభ్రతకు పెద్దపీట వేశారని కొనియాడారు. కానీ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వాటా నిధులు రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో పల్లె ప్రకృతి వనాలు ఎండిపోయి, పారిశుధ్యం లోపించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో నాటిన 250 కోట్ల మొక్కలను సంరక్షించాల్సింది పోయి, అభివృద్ధి పనుల పేరిట చెట్లను విచక్షణారహితంగా నరికివేస్తున్నారని ఆరోపించారు. 420 హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ప్రజలే బుద్ధి చెప్తాన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇవ్వాలన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని, గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి పల్లెల అభివృద్ధిని కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, మండల అధ్యక్షుడు నత్తి రాజ్ కుమార్. నియోజకవర్గం బి ఆర్ ఎస్ శ్రేణులు ప్రజలు పాల్గొన్నారు