Mallepoola Pallaki | మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ఇరుముడి’ నుంచి “మల్లెపూల పల్లకి” వీడియో సాంగ్ అధికారికంగా విడుదలైంది. అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యంలో సాగే ఈ పవర్ఫుల్ అండ్ ఎనర్జిటిక్ ఫోక్ సాంగ్‌కి జి.వి. ప్రకాష్ కుమార్ అదిరిపోయే సంగీతం అందించగా, ప్రముఖ గాయకుడు దప్పు శ్రీను తనదైన జానపద శైలి గొంతుతో పాటను మరింత ఉత్సాహంగా ఆలపించారు. చౌదం శ్రీనివాస రావు అందించిన సాహిత్యం మరియు ఈ పాటకు సంబంధించిన మాస్ డెన్స్ మూమెంట్స్, ఆధ్యాత్మిక వాతావరణం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.