Mandaadi Trailer | సముద్రం నేపథ్యంలో హై-వోల్టేజ్ యాక్షన్.. సూరి, సుహాస్‌ల ‘మండాడి’ ట్రైలర్ విడుదల!
Mandaadi | కోలీవుడ్ నటుడు సూరి (Soori) హీరోగా, టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు సుహాస్ (Suhas) విలన్ పాత్రలో నటిస్తున్న పాన్-ఇండియన్ చిత్రం 'మండాడి' (Mandaadi).
Mandaadi | కోలీవుడ్ నటుడు సూరి (Soori) హీరోగా, టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు సుహాస్ (Suhas) విలన్ పాత్రలో నటిస్తున్న పాన్-ఇండియన్ చిత్రం ‘మండాడి’ (Mandaadi). సముద్రం నేపథ్యంలో రాబోతున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను ‘సెల్ఫీ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మతిమారన్ పుగళేంది (Mathimaran Pugazhendhi) ఈ చిత్రానికి కథ అందించి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే.. తమిళనాడులోని తీర ప్రాంతాలకు చెందిన సాంప్రదాయ బోట్ రేస్ (Sailboat Racing) పోటీల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సముద్రం నేపథ్యంలో సాగే హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఇది రూపొందుతోంది. ఇందులో సూరి సరసన మహిమా నంబియార్ హీరోయిన్గా నటిస్తుండగా, తెలుగు నటుడు సుహాస్‌తో పాటు ప్రముఖ నటుడు సత్యరాజ్, రవీంద్ర విజయ్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంప్రెస్సివ్‌గా ఉంది. ఈ సినిమా కోసం హీరో సూరితో పాటు నటుడు సుహాస్ ఎలాంటి బాడీ డబుల్స్ లేకుండా సముద్రంలో రిస్కీ యాక్షన్ సన్నివేశాలు, బోట్ రేస్ సీక్వెన్స్‌లలో చాలా కష్టపడి నటించినట్లు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

