63 రూపాయి నాణేలు మింగిన వ్యక్తి… రెండు రోజులు ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు
జైపూర్: ఒక వ్యక్తి ఏకంగా 63 రూపాయి నాణేలు మింగాడు. దీంతో కడుపు నొప్పితో బాధ పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా ఎక్స్ రే తీసిన వైద్యులు ఆ వ్యక్తి కడుపులో పేరుకుపోయిన రూపాయి నాణేలను గుర్తించారు. రెండు రోజుల పాటు ఆపరేషన్ చేసి వాటిని బయటకు తీశారు. రాజస్థాన్లోని జోధ్పూర్లో ఈ సంఘటన జరిగింది. 36 ఏళ్ల వ్యక్తి తీవ్ర నిరాశలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో జూలై 25 నుంచి వరుసగా రెండు రోజుల పాటు రూపాయి నాణేలు మింగాడు. అనంతరం అతడు తీవ్ర కడుపు నొప్పితో బాధపడగా కుటుంబ సభ్యులు జూలై 27న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎక్స్ రే తీసిన ఎండీఎం హాస్పిటల్ వైద్యులు, ఆ వ్యక్తి కడుపులో రూపాయి నాణేలు కుప్పగా ఉండటాన్ని గుర్తించారు.
కాగా, ఎండీఎం హాస్పిటల్ వైద్యులు సుదీర్ఘంగా రెండు రోజుల పాటు ఆపరేషన్ నిర్వహించారు. ఎండోస్కోపిక్ ప్రక్రియ ద్వారా ఆ వ్యక్తి కడుపులోని 63 రూపాయి నాణేలను బయటకు తీశారు. ప్రస్తుతం అతడు ఆరోగ్యంగా ఉన్నాడని గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం హెడ్ డాక్టర్ నరేంద్ర భార్గవ్ తెలిపారు. తీవ్ర మనస్థాపంతో ఉన్న ఆ వ్యక్తి రెండు రోజులపాటు రూపాయి నాణేలు మింగినట్లు చెప్పారు. అతడ్ని ప్రశ్నించగా 10-15 నాణేలు మాత్రమే మింగినట్లు చెప్పాడని, అయితే ఆ వ్యక్తి కడుపులో ఏకంగా రూపాయి నాణేలు 63 ఉన్నాయని వివరించారు. తీవ్ర మనోవేదనతో బాధపడుతున్న అతడికి మానసిక చికిత్స అందించాలని కుటుంబ సభ్యులకు సూచించినట్లు వెల్లడించారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

