ఇందూరును ముద్దాడిన కాళేశ్వరం జలాలు
కాళేశ్వరం జలాలు నిజామాబాద్ జిల్లాను మరోమారు ముద్దాడాయి. ఆదివారం ఉదయం 7 గంటలకు జిల్లా సరిహద్దులోని కమ్మర్పల్లి మండలం నాగాపూర్ శివారులోని క్రాస్‌రెగ్యులేటర్ గేట్లను అధికారులు ఎత్తడంతో కాళేశ్వరం జలాలు జిల్లాలోకి అడుగుపెట్టాయి.
- రాజేశ్వర్‌రావుపేట్ వద్ద మూడు పంపులతో ఎత్తిపోత
- కేసీఆర్, ఎమ్మెల్యే వేముల చిత్రపటాలకు క్షీరాభిషేకం
మోర్తాడ్, ఆగస్టు 2: కాళేశ్వరం జలాలు నిజామాబాద్ జిల్లాను మరోమారు ముద్దాడాయి. ఆదివారం ఉదయం 7 గంటలకు జిల్లా సరిహద్దులోని కమ్మర్పల్లి మండలం నాగాపూర్ శివారులోని క్రాస్‌రెగ్యులేటర్ గేట్లను అధికారులు ఎత్తడంతో కాళేశ్వరం జలాలు జిల్లాలోకి అడుగుపెట్టాయి. వరదకాలువ 73వ కిలోమీటర్ వద్ద రాంపూర్ పంప్‌హౌస్ వద్ద నాలుగు మోటర్లను ఆన్‌చేసి నాలుగు పంపుల ద్వారా వరదకాలువలోని నీటిని విడుదల చేయడంతో 34 కిలోమీటర్ల దూరంలోని రాజేశ్వర్‌రావుపేట్ పంప్‌హౌస్‌కు కాళేశ్వరం జలాలు చేరుకున్నాయి. వరద కాలువకు కాళేశ్వరం జలాలను ఎత్తిపోయడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమైంది. ఇక తమ పంటలకు ఢోకా లేదన్న ధీమాను వ్యక్తంచేస్తున్నారు. కాగా కమ్మర్పల్లి-మోర్తాడ్ సరిహద్దులోని తిమ్మాపూర్ బైపాస్‌రోడ్డు సమీపంలో వరద కాలువ బ్రిడ్జి వద్ద రివర్స్‌పంపింగ్ ద్వారా నీరు ఎదురెక్కి పారుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. వరదకాలువలో ఎదురెక్కి వస్తున్న కాళేశ్వరం జలాలపై బీఆర్ఎస్ నాయకులు, రైతులు పూలు చల్లిస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమ్మర్పల్లి శివారులో వరదకాలువపై కేసీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి చిత్రపటాలకు కమ్మర్పల్లి, మోర్తాడ్, వేల్పూర్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, రైతులు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

