Viral Video: క్రాకర్స్‌కు భయపడిన గుర్రం… కూర్చొన్న పెళ్లి కుమారుడితో సహా పరుగు
న్యూఢిల్లీ: ఒక్కసారిగా పటాకులు కాల్చడంతో భయపడిన గుర్రం, పైన కూర్చొన్న పెళ్లి కుమారుడితో సహా అక్కడి నుంచి పరుగెత్తింది. ఒక పెళ్లి వేడుకలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సాధారణంగా పెళ్లిళ్లలో ఊరేగింపు కోసం గుర్రాలను వినియోగిస్తారు. అయితే బ్యాండ్ మేళం, టపాకుల మోతకు అవి బెదిరిపోతాయి. అలాంటప్పుడు గుర్రాలను నియంత్రించడం చాలా కష్టం. కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి.
ఇలాంటి తరహా ఘటన ఒక పెళ్లి వేడుకలో జరిగింది. పెళ్లి కొడుకు గుర్రంపై కూర్చొన్నాడు. ఊరేగింపునకు అంతా సిద్ధమవుతున్నారు. దీనికి ముందు కొన్ని పూజలు నిర్వహించారు. అయితే ఒకవైపు మేళ తాళాలకు ఆ గుర్రం బెదిరి ఉన్నది. మరోవైపు కొందరు ఉన్నట్టుండి క్రాకర్స్ కాల్చారు. దీంతో భయంతో మరింత బెదిరిపోయిన ఆ గుర్రం అక్కడి నుంచి వేగంగా పరుగెత్తింది. దాని పైనే పెళ్లి కుమారుడు కూర్చొని ఉన్నాడు. అతడి పరిస్థితిని మాటల్లో చెప్పలేం.
మరోవైపు గుర్రానికి చెందిన వ్యక్తి కూడా దాని వెంట పరుగెత్తాడు. అయితే గుర్రం వేగాన్ని అందుకోలేకపోయాడు. ఊహించని ఈ ఘటనకు పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యులు, బంధువులు షాక్ అయ్యారు. ఏమి చేయాలో అన్నది వారికి పాలుపోలేదు. ‘గంటా’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే 40 లక్షలకుపైగా ఈ వీడియోను వీక్షించారు. గుర్రంపైన ఉన్న పెళ్లి కుమారుడి పరిస్థితిపై పలువురు ఫన్నీగా కామెంట్లు చేశారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

