మీకు జెంటిల్మెన్ చిత్రంలో చికుబుకు చికుబుకు రైలే పాట గుర్తుందా? ఇందులో ప్రభుదేవా తల, అవయవాలు లేకుండా షూట్లో డ్యాన్స్ చేసి ఆశ్చర్యపరుస్తాడు. అచ్చు అలాంటి సీన్ ఓ చోట నిజంగా కనిపించింది. గూగుల్ మ్యాప్‌లో కనిపించిన ఈ వింత ఫొటో నెటిజన్లు ఆశ్చర్యపరుస్తోంది. తల, అవయవాలు కనిపించకుండా హజ్మత్ షూట్లో విన్యాసాలు చేస్తున్న ఓ వ్యక్తి ఫొటో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మే, 2021లో గుర్తించిన ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఈ ఫొటో యూఎస్‌లోని న్యూయార్క్ సిటీలోగల బ్రూక్లిన్ నేవీలో కనిపించింది. రోడ్డు మధ్యలో హజ్మత్ షూట్ నిల్చున్నట్లుంది. అందులో శరీరం లేదు. మిగతా ఫొటోల్లో ఆ షూట్ డ్యాన్స్ చేస్తున్నట్లు, గాల్లో విన్యాసాలు చేస్తున్నట్లు కనిపించింది. నేవీ ఆధీనంలో ఉండే ఈ స్థలంలో ఇది ఎవరు చేశారో తమకు తెలియడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, నెట్టింట ఈ ఫొటో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.