ప్రస్తుతం సోషల్ మీడియాలో దేని మీద చర్చ జరుగుతుందో తెలుసు కదా. ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి తాజాగా విడుదలైన నా పాట చూడు.. నా పాట చూడు.. నాటు నాటు అనే పాట లిరికల్ సాంగ్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. యూట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో ఉండటంతో పాటు ఆ వీడియోకు విడుదలైన రెండు రోజులకే కోటి వ్యూస్ వచ్చాయి.
ఆ వీడియోను చూస్తున్నంతసేపు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వేస్తున్న ఫాస్ట్ ఫార్వార్డ్ డ్యాన్స్‌ను కళ్లు అప్పగించి మరీ చూడటం తప్పితే మనం చేసేదేం ఉండదు. వాళ్లు ఇద్దరూ కలిసి అంత అద్భుతంగా డ్యాన్స్ వేశారు.
వాళ్ల డ్యాన్స్‌ను ఓ అమ్మాయి అనుకరించింది. ఆ పాటలో ఇద్దరూ కలిసి చేతులు పట్టుకొని వేసే డ్యాన్స్‌ను తను కూడా వేసింది. తనకు చేతులు లేకున్నా.. ఏమాత్రం అధైర్యపడకుండా.. అచ్చం ఎన్టీఆర్, చరణ్ స్టెప్స్‌ను దింపేసింది. తన డ్యాన్స్ వీడియో ట్విట్టర్లో షేర్ అవడంతో ఆ వీడియోను చూసిన ఆర్ఆర్ఆర్ టీమ్ ఆ వీడియోను రీట్వీట్ చేసి సినిమాపై నీకు ఉన్న ప్రేమ, గౌరవానికి మేము ఫిదా అయిపోయాం అని క్యాప్షన్ పెట్టింది. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఆ బాలిక చేసిన డ్యాన్స్‌ను చూసి ఫిదా అవుతున్నారు. శభాష్ చెల్లెమ్మా.. బాగా చేశావు. నీకు మంచి భవిష్యత్తు ఉంది. నీకు ఉన్న అంగవైకల్యాన్ని పట్టించుకోకుండా.. ఎంతో ధైర్యంతో ముందుకు వచ్చి.. సూపర్బ్ డ్యాన్స్ చేశావు అంటూ తనను పొగడ్తల్లో ముంచెత్తున్నారు.
Respect & your love towards the film ❤️🙏🏻 #RRRMassAnthem #RRRMovie https://t.co/g9bXFarsOj
— RRR Movie (@RRRMovie) November 12, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Premature Baby : 5 నెలలకే పుట్టాడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు
shonke village | 5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
ఇక్కడ వందేండ్లు బతకడం చాలా కామన్.. కారణమేంటో తెలుసా !!
Married life tips | కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
Mukesh Ambani | స్పోర్ట్స్.. ఆతిథ్యంపై ముకేశ్ అంబానీ క్రేజీ.. అందుకే లండన్ ఎస్టేట్ సొంతం?!