Viral Video | నాగుపాము.. ఈ పేరు వినగానే భయంతో వణికిపోతాం. ఇక ప్రత్యక్షంగా చూస్తే.. పరుగులు పెడతాం. అలాంటి పాము పడగవిప్పి బుసలు కొడితే.. గుండె ఆగినంత పనైతది. అలాంటి ఘటనే ఒకటి తాజాగా చోటు చేసుకుంది. బుసలుకొడుతున్న పామును ఓ వ్యక్తి ఎంతో చాకచక్యంగా చేత్తో పట్టుకోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ యూజర్ అవినాష్ యాదవ్ షేర్ చేశారు. వీడియోలో ఏముందంటే.. యాక్టీవా ముందు భాగంలో ఓ నాగుపాము ఉంటుంది. దాన్ని బయటకు తీసేందుకు పాములు పట్టేవ్యక్తి ప్రయత్నిస్తుంటాడు. ముందుగా స్క్రూ డ్రైవర్ సాయంతో యాక్టీవా ముందు భాగాన్ని తొలగిస్తాడు. అంతరం పామును బయటకు పంపేందుకు ప్రయత్నిస్తాడు. అయితే, అది ఎంతకీ బయటకు రాకపోగా.. ఆ వ్యక్తిపైకి బుసలు కొడుతూ తిరగబడుతుంది. అయినప్పటికీ ఆ వ్యక్తి పట్టుకోల్పోకుండాకొంత సమయం శ్రమించి ఎంతో చాకచక్యంగా ఆ పామును చేత్తో బయటకు తీస్తాడు.
అతను చేసిన ఈ సాహసాన్ని అక్కడే ఉన్న వారు వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇంకేముంది.. అది కాస్తా వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అతని సాహసాన్ని మెచ్చుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరూ చూసేయండి.