న్యూఢిల్లీ: ఒక ఏనుగు తొండంతో అమ్మాయి చెంపపై బలంగా కొట్టింది. దీంతో షాకైన ఆమె అదుపు తప్పడంతో చేతిలోని మొబైల్ ఫోన్ కింద పడింది. అయితే ఆ మొబైల్ ఫోన్‌ను లాక్కునేందుకు ఏనుగు విఫల యత్నం చేసింది. ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక భారీ ఏనుగు పెద్ద గోడ అవతల ఉన్నది. ఏడుగురు వ్యక్తులు అక్కడకు వచ్చి తమ మొబైల్ ఫోన్లు, కెమేరాలతో ఫొటోలు, వీడియోలు తీయడంలో బిజీ అయ్యారు. ఆ ఏనుగు తన తొండాన్ని చాచగా, ఒక మహిళ దానిని చేతితో ముట్టుకుంది.
కాగా, ఆ ఏనుగు ఉన్నట్టుండి పక్కనే ఉన్న మరో మహిళ చెంపపై తొండంతో బలంగా కొట్టింది. దీంతో ఊహించని ఈ ఘటనకు ఆమె షాక్ అయ్యింది. ఆమె పడబోగా పక్కనే ఉన్న వ్యక్తి పట్టుకున్నాడు. అయితే ఆ యువతి చేతిలోని మొబైల్ ఫోన్ కింద పడింది. మరోవైపు ఆ ఏనుగు తన తొండంతో మొబైల్ ఫోన్‌ను తీసుకునేందుకు తెగ ప్రయత్నించింది. అప్రమత్తమైన అక్కడి వారు వెంటనే కింద పడిన మొబైల్‌ను తీసుకున్నారు.
‘ఫెయిల్ ఆర్మీ’ అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేసిన ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇప్పటికే రెండు లక్షల మందికిపైగా ఈ వీడియోను వీక్షించారు. ఏనుగు తొండంతో అమ్మాయి చెంపపై కొట్టడంపై ఫన్నీగా కామెంట్లు పోస్ట్ చేశారు.
“Come a little closer!” pic.twitter.com/EfDjl4EoW0
— CCTV_IDIOTS (@cctv_idiots) May 22, 2022