ఏనుగును చూసిన ఓ పులి క్షణం ఆలోచించకుండా పారిపోయింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దట్టమైన అడవిలో ఓ మార్గం గుండా ఏనుగు గంభీరంగా నడుచుకుంటూ వస్తోంది. అదే దారిలో ఓ పులి కూడా పడుకొని ఉంది. గజరాజు నడక శబ్దంతో పులి ఒక్కసారి వెనక్కి చూసింది. ఇక అంతే ఏ మాత్రం ఆలోచించకుండా.. అడవిలోకి పులి పరుగెత్తింది. ఈ వీడియోను నటి, వన్యప్రాణి సంరక్షణ కార్యకర్త దియా మీర్జా తన ట్విట్టర్లో షేర్ చేశారు.
Watch what happens at the end! @SanctuaryAsia is looking for the person who captured this video. Kindly share in comments 💚 @BittuSahgal @vivek4wild @wti_org_india pic.twitter.com/H2FbIE2xYv
— Dia Mirza (@deespeak) May 28, 2021