లక్నో: బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో దుస్థితికి ఒక వీడియో అద్దం పడుతున్నది. స్కూటీపై వెళ్తున్న దంపతులు నీటి గుంతలో పడ్డారు. తెరిచిన మ్యాన్ హోల్లో స్కూటీ మాయం కాగా, ఆ దంపతులు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. అలీఘఢ్‌లోని కిషన్పూర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. వర్షాలకు అక్కడి రోడ్లు, వీధులు జలమయమయ్యాయి. దీంతో వర్షం నీరు పారేందుకు ఒక చోట మ్యాన్ హోల్‌ను తెరిచి ఉంచారు. అయితే అక్కడ ఎలాంటి హెచ్చరికలు ఉంచలేదు.
కాగా, స్కూటీపై వెళ్తున్న దంపతులు తమ వాహనాన్ని రోడ్డు పక్కగా పార్క్ చేసేందుకు నీటిమయమైన చోటకు వెళ్లారు. అయితే అక్కడ తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో వారి స్కూటీ పడిపోయింది. మ్యాన్ హోల్ పక్కన నీటిలో పడిన ఆ జంటను స్థానికులు రక్షించారు. అయితే వారి స్కూటీ ఆ మ్యాన్ హోల్లో మునిగి మాయమైంది. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిన ఆ దంపతులను యుపీ పోలీసు అధికారి దయానంద్ సింగ్ అత్రి, ఆయన భార్య అంజు అత్రిగా గుర్తించారు. డాక్టర్‌ను కలిసేందుకు వారు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
As #Monsoon2022 reaches Uttar Pradesh, a video has emerged showing a couple on a scooter falling in a ditch after heavy waterlogging in and around #Aligarh. Luckily, the nearby locals rescued them. pic.twitter.com/I5q2JRHdGF
— Mirror Now (@MirrorNow) June 19, 2022