Bori Wala Palazzo | ప్రస్తుతం యువత ఫ్యాషన్‌గా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతోంది. అందుకు తగ్గట్టుగానే డిజైనర్లు కూడా దుస్తులను తయారు చేస్తున్నారు. కష్టమర్లను ఆకర్షించేందుకు బ్రాండెడ్ దుస్తులతోపాటు.. విచిత్రమైన బట్టలు తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. జనాలు కూడా వాటిని ఎగబడి కొంటున్నారు మరి. తాజాగా ఓ డిజైనర్ తయారు చేసిన విచిత్రమైన ప్యాంట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదే గోనెసంచితో తయారు చేసిన పలాజో ప్యాంట్. ఆశ్చర్య పోతున్నారు కదూ..! ఇందులో ఇంకో షాకింగ్ విషయం ఉంది. అదేంటో తెలుసా దాని ధర. అది వింటే నోరెళ్లబెట్టాల్సిందే మరి.
సాధారణంగా వడ్లు, బియ్యం, చిరు ధాన్యాలు నింపుకునేందుకు వినియోగించే గోనెసంచి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. వాటిని ఎక్కువగా వ్యవసాయ సంబంధిత అవసరాల కోసం వినియోగిస్తుంటాం. అయితే,
ఆ సంచితో ఓ డిజైనర్ పలాజో ప్యాంట్ తయారు చేశారు. దాన్ని ఓ షాపింగ్‌మాల్‌లో డిస్ప్లేలో పెట్టాడు. ఇంత వరకూ బాగానే ఉన్నా. దాని ధర వింటేనే గుండెల్లో దడ పుడుతోంది. ఏ రూ.వెయ్యి, రూ.రెండు వేలో అయితే పర్వాలేదు. ఆ గోనె సంచి ప్యాంట్ ధర ఏకంగా రూ.60వేలు అంట. అయినాకూడా జనాలు ఈ ప్యాంట్‌ను ఎగబడి మరీ కొంటున్నారట.
ఇందుకు సంబంధించిన వీడియోని Sachkadwahai అనే నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘ఈ పలాజోని రూ.60వేలు పెట్టి కొంటారా..?’ అని క్యాప్షన్ ఇచ్చారు. అంతే ఇంకేముంది వీడియో పోస్ట్ చేసిన క్షణాల్లోనే లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.