సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఈ బాలీవుడ్ బ్యూటీ ప్రస్తుతం మాల్దీవుల్లో ఫ్యామిలీతో సహా.. వెకేషన్లో ఉంది. అక్కడే సూపర్ డూపర్‌గా ఎంజాయ్ చేస్తోంది. తను ఎక్కడికెళ్లినా.. తన ఫ్యాన్స్‌ను మరిచిపోదు కదా. ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాలో వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటుంది.
రీసెంట్గా బ్లూ కలర్ బికినీ వేసుకొని.. బీచ్‌లో సన్నీ బీరు పొంగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలుసు కదా. తాజాగా తన కొత్త నేస్తంతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
అక్కడ ఓ ఐలాండ్‌లో జంతువుల రెస్క్యూ ఆపరేషన్‌ను సన్నీ చేపట్టిందట. అక్కడే తనకు ఓ నేస్తం దొరికాడట. ఆయన ఎవరో కాదు.. మకావ్ జాతికి చెందిన రామ చిలుక. అవును.. అది చాలా నాటీ అని.. తన భుజం మీద వాలి.. నా సన్ గ్లాసెస్‌నే తీసేయబోయాడు.. అంటూ సన్నీ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది.