ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్.. ఇండియాలో బెంగళూరే బెస్ట్

న్యూఢిల్లీ: ప్రభుత్వం విడుదల చేసిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020లో బెంగళూరు టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో పుణె, అహ్మదాబాద్ ఉన్నాయి. నగరాల్లో జీవనం సాగించేందుకు అనుకూల పరిస్థితులకు అనుగుణంగా ఈ ర్యాంకులను కేటాయించారు. ఇందులో మిలియన్ ప్లస్ జనాభా ఉన్న నగరాల్లో బెంగళూరు ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకుంది. టాప్ టెన్‌లో ఉన్న నగరాలు ఒకసారి చూస్తే.. బెంగళూరు తర్వాత పుణె, అహ్మదాబాద్, చెన్నై, సూరత్, నవీ ముంబై, కోయంబత్తూర్, వడోదర, ఇండోర్, గ్రేటర్ ముంబై ఉన్నాయి.
ఇక పది లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో షిమ్లా తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో భువనేశ్వర్, సిల్వాసా, కాకినాడ, సేలం, గాంధీనగర్, గురుగ్రామ్, దేవన్‌గిరి, తిరుచిరాపల్లి ఉన్నాయి. దీనికి సంబంధించి 2020లో సర్వే నిర్వహించారు. మొత్తంగా 111 నగరాలు ఇందులో పాల్గొన్నాయి. పట్టణాభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు, మెరుగైన జీవన ప్రమాణాల ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించినట్లు పీఐబీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఇక వీటితోపాటు మున్సిపల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్‌ను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇందులో మిలియన్ ప్లస్ కేటగిరీలో ఇండోర్ టాప్‌లో ఉండగా.. సూరత్, భోపాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మిలియన్ కన్నా తక్కువ జనాభా కేటగిరీలో న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ టాప్‌లో ఉండగా.. తిరుపతి, గాంధీనగర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish Rao | కనీసం సెక్రటరీనే లేడు.. నువ్వేం ఇండస్ట్రీలను ఆకర్షిస్తావ్.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
బ్రహ్మగారిగుట్టపై వీరబ్రహ్మేంద్రస్వామికి విశేష పూజలు
Brs Party | ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేతలు.. వీడియో
Sun Group | అనిరుధ్, కావ్య మారన్ వివాహ వేడుక.. ఉద్యోగులకు బంగారం కానుకగా ఇచ్చిన సన్ గ్రూప్!
‘కృష్ణా జలాల అక్రమ తరలింపును తక్షణమే ఆపాలి’
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

