Viral Video | మహారాష్ట్రలో కొందరు ఆటోవాలాలకు రివర్స్ ఆటోరిక్షా డ్రైవింగ్ పోటీలు పెట్టారు. సంఘమేశ్వర యాత్రలో భాగంగా సంగ్లీ జిల్లా హరిపూర్ గ్రామంలో ఈ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో పలువురు ఆటోవాలాలు పాల్గొని దుమ్మురేపే డ్రైవింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. కిలోమీటర్ల దూరం వరకు ఆగకుండా హైస్పీడ్‌తో ఆటోను రివర్స్ చేస్తూ ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు ఆటోవాలాల ప్రతిభను మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.
#WATCH | Maharashtra: A reverse auto rickshaw driving competition was organised at Haripur village, Sangli on the occasion of Sangameshwar Yatra today. pic.twitter.com/dlkMdompnz
— ANI (@ANI) January 24, 2023