Digestion In Kids | పిల్లల్లో శారీరక, మానసిక పరమైన ఎదుగుదల ఉండాలంటే వారి జీర్ణవ్యవస్థ చక్కగా పని చేయడం చాలా అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్లల ఎదుగుదలలో వారి జీర్ణవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని వారు తెలియజేస్తున్నారు. తీసుకునే ఆహారంలో ఉండే పోషకాలు శరీరానికి అందేలా చేయడంలో, శరీర పెరుగుదలలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా కాపాడడంలో చక్కటి జీర్ణవ్యవస్థ పాత్ర ఎంతో ఉంటుంది. పిల్లలల్లో జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని పెంపొందించడం చాలా అవసరం. ఇది కాలానుగుణంగా వారి ఎదుగుదలకు, శ్రేయస్సుకు ఎంతో తోడ్పడుతుంది. పిల్లల ఎదుగుదలలో కీలక పాత్ర పోషించే జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని పెంపొందించటానికి కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుందని పిల్లల వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.
పోషకాలు కలిగిన ఆహారం జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది. చక్కటి ఆహారం జీర్ణవ్యవస్థకు ఒక మూల స్తంభం అని చెప్పవచ్చు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, ఫైబర్ కలిగిన ఆహారాలు, పాల ఉత్పత్తులు వంటి వాటిని పిల్లలు తీసుకునే ఆహారంలో రోజూ ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల వారి శరీర ఆరోగ్యంతో పాటు జీర్ణవ్యవస్థ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే జీర్ణక్రియ సక్రమంగా ఉండాలంటే వారు తగినంత నీటిని తాగడం కూడా చాలా అవసరం. ఆహారాన్ని విచ్ఛినం చేయడంలో, పోషకాలు శరీరానికి అందేలా చేయడంలో, మలబద్దకాన్ని నివారించడంలో నీరు ముఖ్య పాత్ర పోషిస్తుంది. కనుక పిల్లలు రోజూ వారి శరీర అవసరాలకు సరిపడే నీటిని తీసుకునేలా జాగ్రత్త వహించాలి.
రోజూ శారీరక శ్రమ చేయడం వల్ల శరీర ఆరోగ్యంతో పాటు జీర్ణవ్యవస్థ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రోజూ శారీరక శ్రమ చేయడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఆకలి ఎక్కువగా అవుతుంది. పేగుల కదలికలు పెరుగుతాయి. తద్వారా మలబద్దకం సమస్య రాకుండా ఉంటుంది. మలబద్దకం కారణంగా జీర్ణవ్యవస్థ పనితీరు మొత్తం మందగిస్తుంది. రోజూ శారీరక శ్రమ చేయడం వల్ల మలబద్దకం సమస్య తగ్గడంతో పాటు మళ్లీ రాకుండా ఉంటుంది. కనుక పిల్లలు రోజూ ఏదో ఒక వ్యాయామం చేసేలా వారిని ప్రోత్సహించాలి. ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతో పొట్టలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది. ప్రోబయోటిక్స్ కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తరచూ ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటారు. పెరుగు, పాలు, పాల ఉత్పత్తులు, మజ్జిగ వంటి వాటిని పిల్లలకు ఆహారంలో భాగంగా ఇవ్వడం వల్ల జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది.
పిల్లలకు చక్కగా నమిలే విధానాన్ని నేర్పించడం కూడా చాలా అవసరం. చక్కగా నమలడం వల్ల ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది. పిల్లలు చాలా వరకు వేగంగా నమిలేస్తూ ఉంటారు. దీంతో ఆహారం సరిగ్గా జీర్ణమవ్వక అజీర్తి సమస్య తలెత్తుతుంది. అజీర్తి సమస్య జీర్ణక్రియ పనితీరును దెబ్బతీస్తుంది. కనుక పిల్లలకు నెమ్మదిగా, పూర్తిగా నమలడం అలవాటు చేయాలి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ చక్కగా పనిచేస్తుంది. ఈ సూచనలను పాటించడం వల్ల పిల్లలల్లో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. చక్కటి జీర్ణవ్యవస్థ వారి ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుంది.