యాంకర్ సుమ.. వసపిట్టలా ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది సుమ. అందుకే తనకు యాంకర్‌గా చాలా అవకాశాలు వస్తున్నాయి. గత రెండు దశాబ్దాల నుంచి తెలుగు బుల్లితెరను యాంకరింగ్‌లో ఏలేస్తోంది సుమ. ఇప్పటి వరకు తనను ఢీకొట్టేవాళ్లు రాలేదు. ఇక రారు కూడా. తెలుగు బుల్లితెర మీద తనది ప్రత్యేకమైన స్థానం. మలయాళీ అయినప్పటికీ.. తెలుగును బ్రహ్మాండంగా నేర్చుకొని..అచ్చ తెలుగులో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకుల మనసును గెలుచుకుంది సుమ.
తాజాగా సుమ.. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఓ వీడియో పోస్ట్ చేసింది. జడను ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో ఆ వీడియోలో చాలా ఫన్నీవేలో వివరించింది. ఫోన్లో కెమెరా ఆన్ చేసి.. కొంచెం దూరం వెళ్లి.. జడ పట్టుకొని ఫోన్ దగ్గరికి వచ్చి.. ఫోన్‌ను జడతో తూడ్చేసింది.
జడను క్లీనింగ్‌కు ఉపయోగించుకోవచ్చు.. ఎవరినైనా కొట్టడానికి ఉపయోగించవచ్చు. చక్కిలిగింత పెట్టడానికి, గోకడానికి.. ఇలా.. పలురకాలుగా జడను ఉపయోగించవచ్చు. మరి మీరు జడను దేనికోసం వాడుతారు చెప్పండి? అంటూ ఈ వీడియోను పోస్ట్ చేసింది సుమ.
మా పిల్లలు అయితే నా జడను ఒక బొమ్మగా చేసి ఆడుకుంటారు సుమక్క. ఇంతకీ మీది నిజమైన జడేనా లేక సవరమా? అంటూ.. నెటిజన్లు తమకు తోచిన కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సుమక్క వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.