Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి అంకితభావానికి వయసు అడ్డుకాదని మరోసారి నిరూపించారు. 70 ఏళ్ల వయసులోనూ యువ హీరోలకు ఏమాత్రం తీసిపోని ఉత్సాహంతో వరుస సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్న చిరంజీవి, సినిమా కోసం పడుతున్న కష్టం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ‘మెగా 158’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. ఈ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన భారీ సెట్లో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా వర్షంలో జరిగే ఓ కీలక యాక్షన్ ఎపిసోడ్‌ను దర్శకుడు బాబీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
ఈ యాక్షన్ సీక్వెన్స్‌కు ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్లు రామ్–లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ డిజైన్ చేస్తున్నారు. భారీ వర్షంలో తడుస్తూ చేసే ఈ సన్నివేశం శారీరకంగా ఎంతో కఠినమైనదైనా, చిరంజీవి ఎలాంటి అలసట లేకుండా దాదాపు 12 గంటల పాటు నిరంతరంగా షూటింగ్లో పాల్గొనడం విశేషంగా మారింది. ఈ విషయాన్ని చిత్రబృందమే అధికారికంగా వెల్లడించింది. మెగాస్టార్ అంకితభావానికి ఇది నిదర్శనం. ఉదయం 4 గంటలకే ఇంటెన్స్ వర్కౌట్‌తో తన రోజును ప్రారంభించిన చిరంజీవి, ఆ తర్వాత అత్యంత కఠినమైన యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తి కమిట్మెంట్తో పూర్తి చేశారు. వర్షంలో గంటల తరబడి షూటింగ్ చేయడం అంత సులభం కాదు. అయినప్పటికీ ఆయన చూపించిన క్రమశిక్షణ, ఫిట్నెస్, ప్యాషన్ యూనిట్ మొత్తాన్ని ఆశ్చర్యపరిచాయి. అందుకే ఆయన ఇండియన్ సినిమాకు మెగాస్టార్ అని చిత్రబృందం ప్రశంసించింది.
చిరంజీవి ఫిట్నెస్, వర్క్ ఎథిక్పై ఇప్పటికే ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. వయసు పెరిగినా అదే ఎనర్జీ, అదే డెడికేషన్‌తో పనిచేస్తూ కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తాజా యాక్షన్ షెడ్యూల్ కూడా ఆయన కమిట్మెంట్కు మరో నిదర్శనంగా అభిమానులు కొనియాడుతున్నారు. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ‘మెగా 158’ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు. సంగీతాన్ని ఎస్. థమన్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను విజయ్ కార్తిక్ కన్నన్ నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఆంటోని ఎల్. రూబెన్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ కొల్లి–చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మెగాస్టార్ అభిమానులకు పూర్తి స్థాయి మాస్ ట్రీట్‌గా నిలుస్తుందనే నమ్మకంతో చిత్రబృందం షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తోంది.