Anand Mahindram | హిమాచల్ ప్రదేశ్‌లోని 68 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు శనివారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఎన్నికల సిబ్బంది.. వేల అడుగుల ఎత్తులో ఉన్న పోలింగ్ బూత్‌ను చేరుకునేందుకు మంచులో అతి కష్టంమీద ట్రెక్కింగ్ చేస్తూ ప్రయాణించారు. సిబ్బంది ఎన్నికల సామగ్రితో మంచుకొండను ఎక్కుతున్న దృశ్యాలు సైతం వైరల్ అయ్యాయి. దీనిపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఎన్నికల సిబ్బంది మంచులో ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తున్న వీడియోను ట్విట్టర్లో షేర్ చేస్తూ .. ఎన్నికల సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు.
‘12 వేల అడుగుల ఎత్తులో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని చేరుకునేందుకు.. 15 కిలోమీటర్లు మంచులో ట్రెక్కింగ్ చేస్తూ వెళుతున్నారు. ప్రజాస్వామ్యం అమల్లో ఉందని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు ఇప్పటి వరకు వేలల్లో లైక్స్, కామెంట్స్ వచ్చాయి.
Election officials trekking 15 Km in snow to get to a polling station in Himachal at 12k ft Images like this do much better than words in demonstrating our Democracy in Action! pic.twitter.com/bjq0mb0iWR
— anand mahindra (@anandmahindra) November 13, 2022