ఉ్తత్తరాఖండ్ కుర్రాడు ప్రదీప్ మెహ్రా అర్ధరాత్రి 10 కిలోమీటర్ల పరుగు వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. చిత్రనిర్మాత వినోద్ కప్రీ.. నోయిడాలోని రోడ్డుపై పరుగెత్తుతున్న బాలుడితో కారు నడుపుతూ ఇంటరాక్ట్ అవుతున్న వీడియోను పంచుకున్నారు. అతడు ఆన్లైన్లో ఈ వీడియోను షేర్ చేసినప్పటి నుంచి ప్రదీప్ వీడియో సంచలనం సృష్టిస్తోంది. సెలబ్రిటీల నుంచి చిన్న పిల్లల వరకు అందరూ ప్రదీప్‌ను చూసి మురిసిపోతున్నారు.
ఈ వీడియో సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, ఎవ్వరిలో న్యూ టాలెంట్ కనిపించినా ఎంకరేజ్ చేసే వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా దృష్టిని ఆకర్షించింది. ట్విటర్లో ఆయన ప్రదీప్ మెహ్రాను ప్రశంసించారు. ‘ఇది నిజంగా స్ఫూర్తిదాయకం. నా మండే మోటివేషన్ ఇదే. ప్రదీప్ మెహ్రా నిజంగా ఇండిపెండెంట్. రైడ్ ఆఫర్‌ను తిరస్కరించాడు. అతడు ఆత్మనిర్భర్’ అంటూ ట్వీట్ చేశారు.
This is indeed inspiring. But you know what my #MondayMotivation is? The fact that he is so independent & refuses the offer of a ride. He doesn’t need help. He is Aatmanirbhar! https://t.co/8H1BV4v5Mr
— anand mahindra (@anandmahindra) March 21, 2022