జంతువులపై ఉన్న ప్రేమను ఒక్కొక్కరు ఒక్కో విధంగా చాటుకొంటారు. ఈ మహిళ తనకు పాములపై ఉన్న ప్రేమను ఇలా చాటుకొన్నారు. జుట్టును రబ్బర్ బ్యాండ్‌కు బదులు పాముతో ముడేసుకొన్నారు. అలాగే షాపింగ్‌కు వెళ్లారు. అక్కడ ఆమెను చూసి అది పాములాగా ఉన్న క్లిప్పు కావచ్చు అనుకొన్నారు. నిజమైన పాము అని తెలిసి బెదిరిపోయారు. ఆమె ధైర్యసాహసాలను కొందరు మెచ్చుకుంటే.. మరికొందరు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు.