కుక్కలు మనుషులకు మంచి నేస్తాలు. చాలామంది కుక్కలను పెంచుకుంటారు. చిన్న కుక్కపిల్లలను చూసి మురిసిపోతుంటారు. అందుకే సోషల్ మీడియాలో పప్పీల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కాగా, మెట్లెక్కేందుకు ఓ పప్పీ ఇబ్బందిపడుతుండగా మరో పప్పీ సాయం చేసిన వీడియో నెటిజన్ల మనసు దోచుకుంది. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోను ‘పప్పీస్’ అనే యూజర్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇందులో ఓ కుక్కపిల్ల మెట్లు ఎక్కేందుకు ఇబ్బందిపడుతుంటుంది. దీంతో అక్కడే ఉన్న మరో కుక్కపిల్ల మెట్టుపై పడుకోగా, దానిపై నుంచి కుక్కపిల్ల మెట్లెక్కుతూ ఉంటుంది. ‘నిజమైన స్నేహితుడు’ అనే ట్యాగ్‌లైన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకూ 39వేల మంది వీక్షించారు. 750 మంది రీట్వీట్ చేశారు. చూసిన నెటిజన్లంతా లవ్ ఎమోజీలు ఇస్తున్నారు.
True friend😍 👏👏 pic.twitter.com/Lux1PgXQKo
— Puppies 🐶 (@PuppiesIover) June 13, 2022