న్యూఢిల్లీ : వయసు కేవలం ఓ అంకె మాత్రమేనని నిరూపించేలా 67 ఏండ్ల మహిళ ఎలాంటి బెరుకూ లేకుండా రోప్ సైక్లింగ్‌లో అదరగొట్టింది. చీరకట్టుతో రోప్ సైక్లింగ్‌లో దూసుకుపోతున్న పెద్ద వయసు మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కంటెంట్ క్రియేటర్ షై ను ఈ వీడియోను షేర్ చేయగా ఇప్పటివరకూ 2000 మందికిపైగా వీక్షించారు. ఈ వీడియోలో 67 ఏండ్ల మహిళ యల్లో శారీ ధరంచి రోప్‌పై సైకిల్ రైడింగ్ చేయడం కనిపిస్తుంది. ఆమె విజయవంతంగా ఈ ఫీట్‌ను ముగించడం చూడవచ్చు. భూమిపై నుంచి ఎత్తులో ఆమె సైక్లింగ్ చేయడంతో హెల్మెట్ ఇతర భద్రతా ఎక్విప్మెంట్ను ధరించి ఇందులో పాల్గొన్నారు.
67 ఏండ్ల వయసులో ఆమె తన ఆకాంక్షను నెరవేర్చుకున్నారని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు ఫిదా అయిన నెటిజన్లు బామ్మ ఉత్సాహం స్ఫూర్తిదాయకమని ప్రశంసలు గుప్పించారు.