Viral Video | ఇండోనేషియాలో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. రబ్బరు ఏరేందుకు అడవిలోకి వెళ్లిన ఓ మహిళను 22 అడుగులున్న భారీ కొండచిలువ అమాంతం మింగేసింది. సుమత్రా, జాంబి ప్రావిన్స్‌కు చెందిన 54 ఏళ్ల జారా అనే మహిళ రబ్బర్ ఏరేందుకు అడవిలోకి వెళ్లింది. రెండు రోజులైనా ఆమె జాడ కనిపించకపోవటంతో కుటుంబసభ్యులు అడవిలో గాలించారు. ఈ క్రమంలో ఓ చోట ఆమె చెప్పులు, కత్తి, తదితర వస్తువులు కనిపించాయి. దీంతో వారు గ్రామస్థులు, అధికారుల సహకారంతో ఆ ప్రాంతంలో గాలించగా… అక్కడ వారికి ఓ భారీ కొండచిలువ కనిపించింది. దాని కడుపు ఉబ్బి ఉండటాన్ని గమనించారు.
అదృశ్యమైన జారాను కొండచిలువే మింగేసి ఉంటుందని భావించారు. గ్రామస్థులందరూ కలిసి దానిని చంపి పొట్టను చీల్చి.. పూర్తిగా జీర్ణం కాని స్థితిలో ఉన్న మహిళ కళేబరాన్ని బయటకు తీశారు. ఇందుకు సంబంధించి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జారాను మింగేందుకు కొండచిలువకు కనీసం రెండు గంటల సమయం పట్టి ఉంటుందని స్థానిక అధికారులు తెలిపారు. కాగా, ఇంతకుముందు ఈ ప్రాంతంలో 27 అడుగుల పొడవున్న కొండచిలువ కనిపించిందని స్థానికులు తెలిపారు.
A female rubber plantation worker in #Jambi province #Indonesia was found dead after being swallowed by a 6-meters-long python snake.@AJEnglish @BBCNews @trtworld @Reuters @NikkeiAsia @ChannelNewsAsia @telesurenglish @France24_en https://t.co/L0Z1OhcSWY pic.twitter.com/yF13OUqw92
— Hasto Suprayogo (@HastoSuprayogo) October 25, 2022