శుక్రవారం 23 అక్టోబర్ 2020
Tourism - Oct 11, 2020 , 20:39:12

ప‌ర్యాట‌కుల‌ను విశేషంగా ఆక‌ర్షిస్తున్న మ‌ల్లెల‌తీర్థం

ప‌ర్యాట‌కుల‌ను విశేషంగా ఆక‌ర్షిస్తున్న మ‌ల్లెల‌తీర్థం

నాగ‌ర్‌కర్నూలు : చుట్టూ ఎత్తైన కొండ‌లు.. ఎటు చూసిన ప‌చ్చ‌ద‌నం.. ప‌క్షుల కిల‌కిలరావాలు.. వన్య‌ప్రాణుల సంద‌డి న‌డుమ ప్ర‌కృతి ఒడిలో జాలువారే జ‌ల‌పాతం మ‌ల్లెల‌తీర్థం. నాగర్‌కర్నూల్‌ జిల్లా నల్లమల అట‌వీ ప్రాంతంలోని అమ్రాబాద్‌ మండలంలోని మల్లెలతీర్థం జలపాతం ప‌ర్యాట‌కుల‌ను విశేషంగా ఆక‌ర్షిస్తుంది. వ‌రుస‌గా కురుస్తున్న వ‌ర్షాల‌తో జ‌ల‌పాతం ఉప్పొంగి దుముకుతోంది. త‌న జ‌ల స‌వ్వ‌డుల‌తో చూప‌రుల‌ను క‌ట్టిప‌డేస్తుంది. ఆ జ‌లధారాల్లో ప‌ర్యాట‌కులు త‌డిసి ముద్దైతున్నారు. మ‌ల్లెల‌తీర్థం జ‌ల‌పాతం శ్రీశైలం పట్టణానికి సుమారు 50 కిలోమీట‌ర్ల దూరంలో క‌ల‌దు.

logo