ప్రపంచంలో తొలిసారి.. భారత్‌లో ఒకేరోజు 4 లక్షల కరోనా కేసులు
కరోనా కేసులు| దేశంలో కరోనా విళయతాండవం చేస్తున్నది. వైరస్ విజృంభణతో ప్రతిరోజు పాజటివ్ కేసులు భారీసంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో గత 24 గంటల్లో కరోనా కేసులు 4 లక్షలు దాటాయి.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విళయతాండవం చేస్తున్నది. వైరస్ విజృంభణతో ప్రతిరోజు పాజటివ్ కేసులు భారీసంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో గత 24 గంటల్లో కరోనా కేసులు 4 లక్షలు దాటాయి. ఒక్కరోజులో 4 లక్షలకుపైగా కేసులు నమోదవడం ప్రపంచంలో ఇదే తొలిసారి. అదేవిధంగా వరుసగా నాలుగోరోజూ మూడు వేలకు పైగా మరణాలు సంభవించాయి.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 4,01,993 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,91,64,969కు చేరింది. ఇందులో 1,56,84,406 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 2,11,853 మంది మరణించారు. మరో 32,68,710 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కొత్తగా 2,99,988 మంది డిశ్చార్జీ అయ్యారని, కరోనాతో 3523 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు 15,49,89,635 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని తెలిపింది.
కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 62,919 కేసులు, కర్ణాటకలో 48,296, కేరళలో 37,199 చొప్పున నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో కరోనాతో 828 మంది మరణించగా, ఢిల్లీలో 375 మంది, ఉత్తరప్రదేశ్‌లో 332 మంది మృతిచెందారు.
దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 19,45,299 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. దీంతో ఏప్రిల్ 30 నాటికి 28,83,37,385 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
షాకింగ్.. క్రికెటర్ అశ్విన్ ఇంట్లో కరోనా కలకలం.. పది మందికి పాజిటివ్
భారత ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు
జపాన్‌లో భారీ భూకంపం
గుజరాత్ కొవిడ్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి
యూపీలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి
భారత్‌లో విషాదక పరిస్థితులు : అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హార్యిస్
భారత్‌కు పది మిలియన్ డాలర్ల సాయం ప్రకటించిన బోయింగ్
మోడెర్నా టీకాను లిస్ట్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
భద్రత లేకుండా.. గురుద్వారాను సందర్శించిన ప్రధాని
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

