కంఠేశ్వర్, జూన్ 21: నిజామాబాద్ జిల్లా పరిషత్ పాలకవర్గ చివరి సమావేశానికీ కరెంట్ ఇక్కట్లు తప్పలేదు. మీటింగ్ జరుగుతున్న సమయంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో జనరేటర్ సహాయంతో కొనసాగించాల్సి వచ్చింది. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలోనూ పలుమార్లు కరెంట్ పోవడంతో చీకట్లోనే మీటింగ్‌ను కొనసాగించిన సంగతి తెలిసిందే. ఇది మరువక ముందే శుక్రవారం జడ్పీ చైర్మన్ విఠల్‌రావు అధ్యక్షతన నిర్వహించిన జడ్పీ సమావేశానికి కరెంట్ కష్టాలు వెంటాడా యి. కరెంట్ లేకపోవడంతో జనరేటర్ సహాయంతో సమావేశాన్ని కొనసాగించారు.