Zero Shadow Day | పట్టపగలే మాయం కానున్న నీడ..! రేపు హైదరాబాద్లో ఖగోళ అద్భుతం..!
Zero Shadow Day | అద్భుతమైన ఖగోళ సన్నివేశం గురువారం (August 3) హైదరాబాద్లో సాక్షాత్కరించనున్నది. ఖగోళ అద్భుతాన్ని జీరో షాడో డేగా పిలుస్తుండగా.. ఇందులో వస్తువుల నీడ కనిపించదు. మధ్యాహ్నం 12.23 గంటల సమయంలో ఏర్పడనున్నది.
Zero Shadow Day | అద్భుతమైన ఖగోళ సన్నివేశం గురువారం (August 3) హైదరాబాద్లో సాక్షాత్కరించనున్నది. ఖగోళ అద్భుతాన్ని జీరో షాడో డేగా పిలుస్తుండగా.. ఇందులో వస్తువుల నీడ కనిపించదు. మధ్యాహ్నం 12.23 గంటల సమయంలో ఏర్పడనున్నది. సాధారణంగా మిట్ట మధ్యాహ్న సమయంలో ఉన్నప్పుడు వస్తువు నీడ పడదు. ఈ పరిస్థితి అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు జీరో షాడో ఏర్పడుతుంది. అయితే, ఆ సమయంలో మనిషి నీడ కాళ్ల కిందకి వెళ్తుంది. పాదాల అంచున కొద్ది నీడ మాత్రమే కనిపిస్తుంది. అది కుడి, ఎడమల ఏటో వైపు ఒక అగుపిస్తుంది.
ఇది ఉష్ణమండలంలో ఏడాదికి రెండు సార్లు జరుగుతుండగా.. ఈ ఏడాది మే నెలలోనూ ఖగోళ సన్నివేశం కనువిందు చేసింది. ఎండలో నిటారుగా (90డిగ్రీల) ఉంచిన వస్తువుల నీడ 12.23 గంటల కనిపించదని ఖగోళ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, అరుదైన సంఘటనను ప్రజలు తప్పకుండా అనుభూతి చెందాలని సూచిస్తున్నారు. అయితే, సూర్యకాంతిలో ప్రతి వస్తువుకు నీడ ఉంటుంది. కానీ, అదే సూర్యకాంతిలో నీడ ఉండదనే అద్భుతం వెనక అనేక కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు.
నిత్యం భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఇందుకు 24 గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో సూర్యుడు తూర్పు నుంచి ఉదయించి పడమర దిక్కున అస్తమించినట్టుగా అనిపిస్తుంది. ఈ ప్రయాణంలో మధ్యాహ్నం సూర్యుడు తలమీదుగా వెళుతూ.. భానుడి కిరణాలు నిట్ట నిలువుగా 90డిగ్రీల కోణంలో భూమిమీద పడుతుంటాయి. ఆ సమయంలో నిలువుగా ఉన్న వస్తువు నీడ కనిపించదు. కారణం ఆ నీడ ఆ వస్తువు మీదనే పడుతుంది. దీన్నే జీరో షాడో మూవ్మెంట్ అని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ప్రతిరోజు భానుడు మధ్యాహ్న సమయంలో తలమీదుగా వెళ్తున్నట్లు కనిపిస్తుందని, నిత్యం జీరో షాడో ఉండదని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

