హలో..హలో.. బ్రేకింగ్ న్యూస్.. వైఎస్ఆర్టీపీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదట. ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించింది షర్మిలక్క. మొన్నటిదాక ఎగిరెగిరి పడ్డ షర్మిలక్క తీరా ఎలక్షన్ల టైమ్‌కి తట్టా బుట్ట సర్దుకుంది. తమ పార్టీ అంతపొడుగు ఇంతపొడుగు అన్న షర్మిల పోటీ చేయట్లేదని ప్రకటించింది.
ప్రకటిస్తూ ఏమన్నదంటే… పోటీ చేయొద్దని మా సోనియమ్మ చెప్పింది… పోటీ చేస్తే ఓట్లు చీలి కేసీఆర్ సీఎం అవుతారు.. కాబట్టి మీరు కాంగ్రరెస్కు సపోర్ట్ చేయండని సోనియా షర్మిలతో చెప్పిందట. అందుకే వైఎస్సార్టీపీ తెలంగాణ ఎన్నికల్లో పోటీచేయట్లేదట. కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తరట. పాపం.. పాలేరు ప్రజలు ఏమైపోవాలో ఏమో..!!