హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : పబ్లిక్ పేసుల్లో ఇబ్బందికరమైన రీల్స్ చేస్తే.. కేసులు నమోదు చేస్తామని తెలంగాణ పోలీసు శాఖ శుక్రవారం హెచ్చరించింది. బైకులతో రోడ్లపై స్టంట్స్ చేయడం, డబ్బులు వెదజల్లడం, రీల్స్ చేయడం, వీడియోల కోసం పిచ్చి చేష్టలకు పాల్పడి ప్రజలకు ఇబ్బంది కలిగించడం చట్టరీత్యా నేరమని తెలిపింది.
వ్యూస్, సబ్‌స్ర్కైబర్స్ పెరగడం కోసం మోతీనగర్‌కు చెందిన హర్ష అనే యూట్యూబర్ రోడ్లపై డబ్బు వెదజల్లడంపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్టు చేసినట్టు పేర్కొంది.