భీమారం, జనవరి 17: ‘మాకు రేషన్ బియ్యం వస్తలేవు.. ఏ ప్రాతిపదికన రేషన్‌కార్డుల లిస్టు తయా రుచేశారు? అర్హులకు అన్యాయం చేస్తే ఊరుకోం.. గ్రామసభ రోజు ఎంపీడీవో, తహసీల్దార్‌ను నిర్బంధిస్తాం’ అంటూ మంచిర్యాల జిల్లా భీమారంనకు చెందిన యువకులు హెచ్చరించారు. భీమారానికి చెందిన 182 మం దితో కూడిన రేషన్‌కార్డుల లిస్టు బయటకు రావడంతో వారంతా తహసీల్దార్ కార్యాలయానికి శుక్రవారం ఉదయం చేరుకున్నారు. లిస్టులో 182 మంది పేర్లు వచ్చాయని, అందులో కొంత మంది రిటైర్డ్ సింగరేణి కార్మికులు ఉన్నారని, ఏ ప్రాతిపదికన లిస్టు రూపొందించారని ప్రశ్నించారు. గ్రామం లో 1600 మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్నా వారి పేర్లు ఎందుకు రాలేదని, అనర్హుల పేర్లు ఎలా వచ్చాయని తహసీల్దార్‌ను నిలదీశారు. దీంతో తహసీల్దార్ మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్‌తో ఫోన్లో మాట్లాడారు. ‘ సర్వే నిలిపివేయాలని స్థానికులు గొడవ చేస్తున్నారని చెప్పగా.. మరో లిస్టు వస్తుందని, ఇది ఫైన ల్ లిస్ట్ కాదని కలెక్టర్ తెలిపారు. తహసీల్దార్లకు రేషన్‌కార్డుల బాధ్యత ఇవ్వలేదని, ఎంపీడీవోలకే వాటి బాధ్యతలు అప్పగించారని తెలిపారు.