పెద్దపల్లి: జిల్లాలోని గోదావరిఖనిలో రోడ్డు ప్రమాదం జరిగింది. గోదావరిఖనిలోని రమేశ్‌నగర్‌లో ఓ బైకు కల్వర్టును ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. ఇద్దరు యువకులు ద్విచక్రవానంపై వెళ్తుండగా రమేశ్‌నగర్ వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టారు. దీంతో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరొకరు దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను గోదావరిఖనిలోని రామ్‌నగర్‌కు చెందిన మహేందర్, శివరామరాజుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.