మకామారెడ్డి : గణపతి విగ్రహాన్ని(Ganesha idol) తీసుకెళ్తుండగా కరెంటు షాక్ (Electric shock)తగిలి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఆరేపల్లి గ్రామ శివారులో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే..నిజామాబాద్ జిల్లా పెర్కిట్ నుంచి సిరిసిల్లకు గణపతి విగ్రహాన్ని తీసుకు వెళ్తుండగా పాల్వంచ మండలం ఆరేపల్లి గ్రామ శివారులో 11 కెవి విద్యుత్ వైర్లు తగిలి లక్ష్మీనారాయణ (19) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
మరో యువకుడు సాయి (25) కి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. బాధితులు సిరిసిల్ల పట్టణానికి చెందిన వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.