Congress | హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేయడం తప్పేనని, ఇది సరైన పద్ధతి కాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో ఓ రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. దాడికి పాల్పడిన యూత్ కాంగ్రెస్ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎవరికి చెప్పి, ఎవరి ఆదేశంతో దాడికి దిగారని మండిపడినట్టు సమాచారం.
హైదరాబాద్, జనవరి 7 (నమస్తేతెలంగాణ): సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థల్లో 65 ఐటీ ఇన్స్ట్రక్టర్, 2 పీఆర్వో పోస్టులను భర్తీకి అధికారులు ప్రకటన విడుదల చేశారు. అర్హులైన వారు ఈ నెల 10వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు నోటిఫికేషన్లో పేర్కొన్నట్టు వెల్లడించారు.