అలంపూర్ చౌరస్తా, మే 21 : ఉద్యోగం రాలేదని ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాల సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ అశోక్ కథనం ప్రకారం..
వనపర్తి పట్టణంలోని భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన నీతుల భరత్‌కుమార్ (22) ఎంత ట్రై చేసినా ఉద్యోగం దొరకకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది బుధవారం మానవపాడు నుంచి ఇటిక్యాలకు వెళ్లే దారిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని మృతిచెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెల్లడించారు.