మట్టెవాడ, నవంబర్ 1 : వరంగల్‌లోని మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. మట్టెవాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల ఆటోనగర్‌లో శ్రీధర్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడుపుతున్నాడు. బుధవారం రాత్రి ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కు వచ్చిన ఎస్సై విఠల్ తన సిబ్బందితో కలిసి ఫొటోలు తీస్తూ శ్రీధర్‌ను హెచ్చరించాడు. మనస్తాపానికి గురైన శ్రీధర్ అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు వచ్చి వెంట తెచ్చుకున్న కిరోసిన్ ఒంటి మీద పోసుకున్నాడు. ఎస్సై విఠల్ వేధింపులతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన చావుకు ఆయనే కారణమంటూ శ్రీధర్ పోలీస్‌స్టేషన్‌లో నినాదాలు చేశాడు. ఎస్సై, సిబ్బంది అతని ప్రయత్నాన్ని అడ్డుకొన్నారు. మట్టెవాడ సీఐ గోపి మాట్లాడుతూ శ్రీధర్ షాపు వద్ద అడ్డంగా ఉన్న వాహనాల ఫొటోలను ఎస్సై విఠల్ తీస్తుండగా ఆందోళన చెంది, ఆవేశంతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడని తెలిపారు.