ఓదెల, ఆగస్టు 29 : లోన్ యాప్ వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ కు చెందిన తూండ్ల శ్రీనివాస్ (27) లోన్ యాప్ల ద్వారా రూ.4 లక్షల వరకు రుణాలు తీసుకున్నాడు. కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్న అతడిని లోన యాప్ వాళ్లు ఫోన్లలో బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కొలనూర్ రైల్వే స్టేషన్ సమీపానికి వచ్చి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆ తర్వాత బంధువులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు కొలనూర్కు వచ్చి అతడిని మొదట సుల్తానాబాద్, అక్కడి నుంచి కరీంనగర్ దవాఖానకు తరలించారు. పూర్తిగా కాలిన శ్రీనివాస్ పరిస్థితి విషమంగానే ఉన్నట్టు బంధువులు తెలిపారు.