పెద్దపల్లి : జిల్లాలోని మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన సతీశ్ అనే యువకుడు ఓ యువతికి బలవంతంగా పురుగుల మందు తాగించాడు. ఏలువాక ఓదెలు అనే వ్యక్తి.. వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి ఇంటిక వచ్చి చూసేసరికి.. సతీశ్ తన కూతురుని బలవంతం చేస్తూ పురుగుల మందు తాగించాడు.
వెంటనే తేరుకున్న ఓదెలు.. అక్కడే ఉన్న ఓ కర్రతో సతీశ్‌ను కొట్టబోయాడు. కానీ.. అది తన కూతురు తలకు బలంగా తాకింది. దీంతో తల నుంచి తీవ్రంగా రక్తస్రావం అయింది. వెంటనే ఓదెలు.. తన కూతురును కరీంనగర్ లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాడు. కర్రతో దాడి చేసే సమయంలోనే సతీశ్.. అక్కడి నుంచి పరారి అయ్యాడు. కూతురిని ఆసుపత్రిలో చేర్పించిన అనంతరం.. ఓదెలు.. మంథని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా… కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.